Thursday, May 1, 2025
Homeజిల్లాలుపది ఫలితాల్లో "శారద" విజయ దుందుభి 

పది ఫలితాల్లో “శారద” విజయ దుందుభి 

నవతెలంగాణ -పర్కాల
పది పరీక్ష ఫలితాల్లో పరకాల పట్టణానికి చెందిన “శారద” హై స్కూల్ విజయ దుందుభి మోగించింది. 60 విద్యార్థులకు గాను 60 మంది పాసై 100% ఉత్తీర్ణత సాధించి ప్రభంజనం సృష్టించారు. కూనూరు వర్షిత 580/600, మార్గ మంజునాథ్ 570/600, తోట వైష్ణవి 565/600, గడ్డం శ్రావణ్ కుమార్ 556/600, ఇప్ప సాయి చరణ్ 550/600, రావుల రణధీర్ 548/600, మార్కులు సాధించారు. 500 కు పైగా సాధించిన విద్యార్థులు మొత్తం 60 మంది విద్యార్థులు సాధించారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మార్క సత్యనారాయణ విద్యార్థినీ, విద్యార్థులను అభినందించారు. జిల్లాస్థాయిలో మంచి స్థానం సొంతం చేసుకున్నారు. దీంతో పాఠశాల యజమాన్యం స్వీట్ పంచుకొని టపాసులు పేల్చి ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ ఉపాధ్యాయ బృందాన్ని, విద్యార్థులను అభినందించారు. ఇలాగే ప్రతి ఏటా విలువలతో కూడిన విద్యను అందించడంతోపాటు మేలైన ఫలితాలు సాధిస్తూ, తమకు తామే సాటిగా నిలబడుతున్నామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img