నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భారతదేశ జనాభా పరిస్థితి ప్రస్తుతం భారతదేశం జనాభా పరంగా దాదాపు 150 కోట్లు కలిగి ఉండటం వల్ల, వనరుల కొరత, ఉపాధి, గృహం, విద్య, పర్యావరణ మార్పులపై తీవ్ర ప్రభావాలు చూపుతోంది. అందువల్ల ప్రతి ఒక్కరూ “ఒక్క బిడ్డ ముద్దు – మరొక బిడ్డకు హద్దు” అనే నినాదాన్ని పాటిస్తూ కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన జనాభా నియంత్రణ ప్రాముఖ్యత పై హాజరై మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 11 జూలై 2025 నుండి 18 జూలై 2025 వరకు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నమన్నారు. జిల్లాలో ఏ ప్రభుత్వ ఆసుపత్రి లో అత్యధికంగా నార్మల్ డెలివరీ లో జరిగాయో అక్కడ ఉన్న వైద్య సిబ్బంది ప్రజలకి సరిగా వైద్యం చేస్తున్నట్లు అన్నారు.
గత విద్యా సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అన్ని ప్రభుత్వ స్కూల్స్,హాస్టల్ లలో మెడికల్ క్యాంపు లు ఏర్పాటు చేద్దాం అన్నారు. అందరూ మెడికల్ ఆఫీసర్స్ అందరూ ఈ విద్యా సంవత్సరంలో మాతో పాటు కలిసి హాస్టల్ నిద్ర చేయాలనీ, కొత్తగా హాస్టల్స్ లో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులతో మాట్లాడాలని, హోమ్ సిక్ గా ఉన్నవాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. మండలాల్లో ఉన్న సి హెచ్ సి సెంటర్స్, పి హెచ్ సి సెంటర్స్ లలో కచ్చితంగా మెడికల్ ఆఫీసర్ అందుబాటులో ఉండాలి కొంత మంది మధ్యాహ్నం తర్వాత వెళ్లిపోతున్నారు కొన్ని పి హెచ్ సి లలో ఓపి కూడా సరిగా ఉండటం లేదు అలాంటి సెంటర్ లలో ఓపి పెరగాలన్నారు ప్రభుత్వ ఆసుపత్రులలో నార్మల్ డెలివరీ సంఖ్య కూడా పెరగాలని, ఆసుపత్రి లలో కూడా ప్రైవేట్ ఆసుపత్రి ల కంటే మెరుగైన వైద్య సదుపాయాలు ఉన్నాయని, వర్షాకాలం లో ప్రజలు రోగాల బారిన పడకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని అన్నారు.
వచ్చే 15వ ఆగష్టు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు అత్యధికంగా చేసిన వారికి, ఓపి సేవలు ఎక్కువగా అందించిన వారికి మాత్రమే క్రైటీరియా తీసుకొని అవార్డులు ప్రధానం చేయబడుతుంది తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి, డాక్టర్ మనోహర్, డా. యశోద, ప్రోగ్రాం ఇన్‌చార్జ్, డా. సాయి శోభ, డా. శిల్పిని, డా. రామకృష్ణ, డా. సుమన్ కళ్యాణ్, డెమో అంజయ్య, హెల్త్ ఎడుకేటర్స్ వసంతకుమారి,సత్యనారాయణ, సాయి రెడ్డి వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.