Sunday, May 25, 2025
Homeజిల్లాలు10లో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన గురుకుల విద్యార్థులు

10లో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన గురుకుల విద్యార్థులు

- Advertisement -

– సోషల్ వెల్ఫేర్ కీర్తిని చాటారు : ప్రిన్సిపాల్ సరిత
నవతెలంగాణ – రాయపర్తి
పదవ తరగతి ఫలితాల్లో రాయపర్తి గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. బుధవారం తెలంగాణ ఎస్ఎస్సి బోర్డు పదవ తరగతి ఫలితాలను వెల్లడించగా రాయపర్తి గురుకుల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. పాఠశాలలో 80 మంది విద్యార్థినీలకు గాను 80 మంది విద్యార్థులు ఉత్తీర్ణత  ఫలితాలను సాధించారు. 600 మార్కులకు గాను జీ వైశాలి 546 మార్కులు సాధించి మండలంలో మొదటి స్థానంలో నిలిచింది. జి వైష్ణవి 541/600, పి వైష్ణవి 540/600, బి సనశ్రీ 535/600, డి వర్షిని తేజ 533/600, కే వైష్ణవి 528/600 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం అభినందించారు తెలిపారు. దీంతోపాటు 500 మార్కులకు పైగా 24 మంది విద్యార్థులు సాధించారన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సరిత మాట్లాడుతూ.. పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచడానికి ముఖ్య కారణం ఉపాధ్యాయుల బోధనే అన్నారు. విద్యార్థుల సైతం ఇష్టంతో చదివి రాయపర్తి గురుకుల పాఠశాల కీర్తిని చాటారని తెలిపారు. ఇకపై కూడా రాయపర్తి గురుకులంలో విద్యార్థులు విద్యలో, క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పదవ తరగతి విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -