తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీరాంనాయక్
నవతెలంగాణ-వైరాటౌన్
గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ గిరిజన హక్కుల దినోత్సవం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడుతున్నట్టు తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీరాం నాయక్ పిలుపునిచ్చారు. తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వైరా పట్టణంలోని బోడేపూడి భవనంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో ఎన్నికల మ్యానిఫెస్టోలో గిరిజనులకు 15 రకాల హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన ఈ రెండేండ్లలో ఒక్క హామీనీ అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం అయిందన్నారు. రాష్ట్రంలో 10 శాతం ఉన్న గిరిజన జనాభాకు అనుగుణంగా రెండు మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉండగా ఒక్కరికి మాత్రమే ఇచ్చి సామాజిక న్యాయానికి తూట్లు పొడిచిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అంబేద్కర్ అభయహస్తం పేరుతో ప్రతి గిరిజన కుటుంబానికి రూ.12 లక్షల ఆర్థిక సహాయం ఇస్తామని, మైదాన ప్రాంత గిరిజనుల అభివృద్ధికి రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 5 ఐటీడీఏలను ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు. సమ్మక్క సారక్క పథకం ద్వారా ప్రతి తండా, గూడెం, గ్రామ పంచాయతీలకు ప్రతి ఏటా రూ.25 లక్షలు ఇస్తామని, మూడు ఎస్టీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి కార్పొరేషన్‌కు ప్రతి ఏటా బడ్జెట్‌లో రూ.750 కోట్లు ఇస్తామంటూ హామీ ఇచ్చిందన్నారు. ఇందులో ఒక్క హామీ కూడా అమలు చేయలేదని తెలిపారు.
రెండేండ్లుగా బకాయి పడ్డ రూ.154 కోట్ల బెస్ట్ అవైలబుల్ నిధులను విడుదల చేయడం లేదని, దీని వల్ల 25 వేలమంది ఎస్సీ, ఎస్టీ, పేద విద్యార్థులు రోడ్డున పడ్డారన్నారు. రాష్ట్రంలో పోడు భూములను సాగు చేస్తున్న గిరిజనులపై అటవీ శాఖ అధికారులు నిర్ధాక్షిణ్యంగా దాడి చేస్తున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఎర్రబోడు ప్రాంతంలో మహిళలని కూడా చూడకుండా మగ అధికారులు ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తూ జుట్టు పట్టి అమానుషంగా దాడి చేశారని ఆరోపించారు. అటువంటి అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసి తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్ అమర్ సింగ్, ఉమ్మడి జిల్లా నాయకులు బాధావత్ శ్రీను, కునుసొత్ షణ్ముఖ్, బానోతు బన్సీలాల్, తేజావత్ కృష్ణ కాంత్, గుగులోత్ నాగేశ్వరరావు, అజ్మీరా శోభన్ నాయక్, ధరావత్ వినోద్ కుమార్, భూక్యా రమేష్, తేజావత్ సీతారాములు, ధరావత్ నందియా, భూక్యా శంకర్ లాకావత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీరాంనాయక్
నవతెలంగాణ-వైరాటౌన్
గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ గిరిజన హక్కుల దినోత్సవం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడుతున్నట్టు తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీరాం నాయక్ పిలుపునిచ్చారు. తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వైరా పట్టణంలోని బోడేపూడి భవనంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో ఎన్నికల మ్యానిఫెస్టోలో గిరిజనులకు 15 రకాల హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన ఈ రెండేండ్లలో ఒక్క హామీనీ అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం అయిందన్నారు. రాష్ట్రంలో 10 శాతం ఉన్న గిరిజన జనాభాకు అనుగుణంగా రెండు మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉండగా ఒక్కరికి మాత్రమే ఇచ్చి సామాజిక న్యాయానికి తూట్లు పొడిచిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అంబేద్కర్ అభయహస్తం పేరుతో ప్రతి గిరిజన కుటుంబానికి రూ.12 లక్షల ఆర్థిక సహాయం ఇస్తామని, మైదాన ప్రాంత గిరిజనుల అభివృద్ధికి రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 5 ఐటీడీఏలను ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు. సమ్మక్క సారక్క పథకం ద్వారా ప్రతి తండా, గూడెం, గ్రామ పంచాయతీలకు ప్రతి ఏటా రూ.25 లక్షలు ఇస్తామని, మూడు ఎస్టీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి కార్పొరేషన్‌కు ప్రతి ఏటా బడ్జెట్‌లో రూ.750 కోట్లు ఇస్తామంటూ హామీ ఇచ్చిందన్నారు. ఇందులో ఒక్క హామీ కూడా అమలు చేయలేదని తెలిపారు.
రెండేండ్లుగా బకాయి పడ్డ రూ.154 కోట్ల బెస్ట్ అవైలబుల్ నిధులను విడుదల చేయడం లేదని, దీని వల్ల 25 వేలమంది ఎస్సీ, ఎస్టీ, పేద విద్యార్థులు రోడ్డున పడ్డారన్నారు. రాష్ట్రంలో పోడు భూములను సాగు చేస్తున్న గిరిజనులపై అటవీ శాఖ అధికారులు నిర్ధాక్షిణ్యంగా దాడి చేస్తున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఎర్రబోడు ప్రాంతంలో మహిళలని కూడా చూడకుండా మగ అధికారులు ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తూ జుట్టు పట్టి అమానుషంగా దాడి చేశారని ఆరోపించారు. అటువంటి అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసి తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్ అమర్ సింగ్, ఉమ్మడి జిల్లా నాయకులు బాధావత్ శ్రీను, కునుసొత్ షణ్ముఖ్, బానోతు బన్సీలాల్, తేజావత్ కృష్ణ కాంత్, గుగులోత్ నాగేశ్వరరావు, అజ్మీరా శోభన్ నాయక్, ధరావత్ వినోద్ కుమార్, భూక్యా రమేష్, తేజావత్ సీతారాములు, ధరావత్ నందియా, భూక్యా శంకర్ లాకావత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ హామీల అమలుకు పోరాటం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES