నడిగడ్డ సీడ్ కొనుగోలులో పత్తి రైతుల ధర్నా
పాలమూరు అధ్యయన వేదిక సంపూర్ణ మద్దతు
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
సహజమైన పద్ధతుల్లో పంటలు పండిస్తున్న పంటను కార్పొరేట్ సీడ్ పత్తి కంపెనీలు సిండికేట్‌గా మారి రైతులను దోపిడీ చేస్తున్నాయని నడిగడ్డ సీడు పత్తి రైతులు ఆరోపిస్తు న్నారు. దీనికి వ్యతిరేకంగా గురు వారం గద్వాల జిల్లా కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లా డుతూ.. కార్పొరేట్ సీడ్ కంపెనీల చేతుల్లో చిక్కి తమ భూములన్నీ నిస్సారంగా మారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాదంతా కష్టం చేసి పండించిన పంటను కొనడంలో ఈ సీడ్ కంపెనీలు సిండికేట్‌గా మారి రైతులను దోపిడీకి గురిచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఈ సీడ్ కంపెనీల ఆగడాలను తట్టుకోలేమని, ఈ కంపెనీలపై న్యాయవిచారణ జరిపి వారిని శిక్షించి, తమను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారిని శిక్షించేవరకూ తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టంచేశారు. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా గద్వాల అఖిల పక్ష కమిటీ నాయకులు నాగారుదొడ్డి వెంకట్రాములు, కురువ పల్లయ్య, రంజిత్ కుమార్, వీవీ నర్సింహ, ఇక్బాల్ పాషా, గోపాల్ యాదవ్, కృష్ణయ్య, రామిరెడ్డి, జాంపల్లి నర్సింహులు తదితరులు మద్దతు తెలుపుతూ వారితోపాటు ఆందోళనలో పాల్గొన్నారు. కాగా, కలెక్టర్‌తో జరిపిన చర్చల్లో.. సీడు పత్తి విత్తన రైతులు కోరిన విధంగా పండించిన పంటనంతా కొంటామని, రైతులెదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తామని సీడు విత్తన ఆర్గనైజర్లు ఒప్పుకున్నట్టు అఖిలపక్ష నాయకులు తెలిపారు.
కార్పొరేట్ సీడ్ కంపెనీల దోపిడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES