నిందితునికి 20 ఏండ్ల జైలు
రూ. 8 వేల జరిమానా..
బాధిత కుటుంబానికి రూ. 3 లక్షల పరిహారం
రాజేంద్రనగర్ ఫాస్ట్ ట్రాక్ ఎస్‌పీఎల్ కోర్టు తీర్పు
నవతెలంగాణ- శంషాబాద్
బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడికి కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌లోని కౌముర్ జిల్లా కొల్హవా పోస్ట్, అధౌరా పీస్, కన్హనార్ గ్రామానికి చెందిన రంజిత్ సింగ్ (29) రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని గగన్‌పహాడ్‌కు వలస వచ్చాడు. కూలి పని చేసుకుని జీవిస్తున్నాడు. ఇతను 2019లో బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దాంతో ఆయనపై పోలీసులు పోక్సో కేసు నమోదుచేశారు. ఈ కేసును విచారించిన రాజేంద్రనగర్ ఫాస్ట్‌ట్రాక్ ఎస్‌పీఎల్ కోర్టు.. నిందితుడికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష, రూ.8 వేల జరిమానా విధించింది. బాధిత కుటుంబానికి రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. శిక్ష ఖరారైన నేపథ్యంలో నేరస్తుడిని పోలీసులు జైలుకు తరలించారు.
పోక్సో కేసులో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES