Thursday, May 1, 2025
Homeజిల్లాలుపదిలో విజయ దుందుభి మోగించిన గాంధీజీ విద్యాసంస్థలు

పదిలో విజయ దుందుభి మోగించిన గాంధీజీ విద్యాసంస్థలు

  • పదవ తరగతి ఫలితాలలో జిల్లా మొదటి ర్యాంకు సాధించిన చండూరు గాంధీజీ విద్యాసంస్థలు
    నవతెలంగాణ – చండూరు: రాష్ట్ర ప్రభుత్వం బుధవారం  పదవ తరగతి ఫలితాలలో చండూరు మున్సిపాలిటీకి చెందిన గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని గుడిసె అమూల్య శ్రీ , కోటయ్య గూడెంనకు చెందిన అమ్మాయి 590 /600 మార్కులు సాధించి  జిల్లాస్థాయి మొదటి ర్యాంకును సాధించినది.  పందిరి శివప్రియారెడ్డి 579/ 600, ధార హాసిని 577/600, ఉప్పల రేణుక 575/ 600, నకిరేకంటి హన్సిక 574/ 600, ఆవుల శివాని 574 /600, తుమ్మల నేహ శ్రీ 573/600, పెండెం శృతి 572/ 600, కుంటిగొర్ల అజయ్ కుమార్ 571/600, గడిపర్తి పూజా వైష్ణవి 571/ 600 మార్కులు సాధించిన విద్యార్థులను  గాంధీజీ విద్యా సంస్థల లో జరిగిన అభినందన సభలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు శాలువాలతో సన్మానించి, మెమొంటోళ్లు అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ.. గాంధీజీ విద్యాసంస్థలు 100% ఫలితాలతో అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించిందని, ఈ ఫలితాల కోసం కృషిచేసిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు,తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. స్టేట్ ర్యాంక్  జిల్లా మొదటి ర్యాంకు సాధించినదులకుగాను గాంధీజీ విద్యాసంస్థలను చండూరు మున్సిపాలిటీ ప్రజలందరూ అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ సత్యనారాయణమూర్తి, పులిపాటి రాధిక, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img