Saturday, July 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకేంద్ర-రాష్ట్రాల పరస్పర సహకారం అవసరం

కేంద్ర-రాష్ట్రాల పరస్పర సహకారం అవసరం

- Advertisement -

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశ క్లీన్‌ ఎనర్జీ భవిష్యత్తును నడిపించడంలో కేంద్ర-రాష్ట్రాల పరస్పర సహకారం అవసరమని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గురువారం నాడిక్కడ భారత మండపం ‘ఉర్జా మంథన్‌ 2025’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భారతదేశ ఇంధన భద్రత, సహకార విధానాలపై చర్చ జరిగింది. దేశంలోని 22 రాష్ట్రాల నుంచి మంత్రులు హాజరై తమతమ అభిప్రాయాలను పంచుకున్నారు. తెలంగాణ మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ రాష్ట్ర క్లీన్‌, గ్రీన్‌ ఎనర్జీ పాలసీ 2025 కింద తీసుకున్న కీలకమైన చర్యలను వివరించారు. బయో ఇంధనాలు, కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ (సీబీజీ), సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ (సీజీడీ) నెట్‌వర్క్‌లపై దృష్టి సారించి.. ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్నట్టు చెప్పారు. ”హైదరాబాద్‌ నగరమే కాకుండా.. ద్వితీయ శ్రేణి పట్టణాలలో సీజీడీ నెట్‌వర్క్‌లను వేగవంతం చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా సమానమైన ఇంధన లభ్యతను పెంచాలి” అని ఆయన అభిప్రాయపడ్డారు. ”సీఎన్జీ స్టేషన్ల సంఖ్యను పెంచాలి. భాగ్యనగర్‌ గ్యాస్‌ లిమిటెడ్‌లో పెట్టుబడులను పెంచాలి. తద్వారా తెలంగాణలో పట్టణ, సెమీ-అర్బన్‌ పైప్డ్‌ గ్యాస్‌ మౌలిక సదుపాయాల విస్తరణకు వీలు కల్పించాలి” అని కేంద్రాన్ని కోరారు. పెరుగుతున్న పారిశ్రామిక, దేశీయ అవసరాలను తీర్చడానికి తెలంగాణలో సీఎన్జీ, ఎల్‌ఎన్జీ టెర్మినల్స్‌ను స్థాపించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహ-నిధుల వినియోగాన్ని మంత్రి ప్రతిపాదించారు. తెలంగాణలో గణనీయమైన వ్యవసాయ వ్యర్థాల ఉత్పత్తిని ఉదహరిస్తూ.. రాష్ట్రంలో కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ (సీబీజీ) ఉత్పత్తి ఉపయోగించని సామర్థ్యాన్ని ఆయన వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -