నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాని మోడీ బీహార్ పర్యటనపై ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ తీవ్ర విమర్శులు గుప్పించారు. ఎన్నికల వేళ విస్తృత పర్యటనల పేరుతో..రాష్ట్ర ప్రజలకు అబద్దాలు చెప్పాడానికి వస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అవాస్తవాలు వినాలకుంటున్నారా? అని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
బీహార్ పర్యటనలో ఆయన రూ.12,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. బీహార్‌లోని మోతిహారీలో రూ.7,200 కోట్ల విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసి, జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టులు రైల్వే, రోడ్లు, గ్రామీణాభివృద్ధి, ఫిషరీస్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలకు సంబంధించినవి.
ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు, మోడీ పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో రూ.5,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులు ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, రైల్వే, రోడ్ల రంగాలకు సంబంధించినవి. బంకురా, పురూలియా జిల్లాల్లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) ప్రాజెక్టు కోసం రూ.1,950 కోట్లతో శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.