Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వైద్య శిభిరం

జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వైద్య శిభిరం

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
పెద్దవూర మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాల లో శుక్రవారం మండల వైద్యాధికారి కొమ్మగోని నగేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత వైద్య శిభిరం నిర్వహించారు.
ఈ ఆరోగ్య శిబిరం నందు 80 మందికి బాల బాలికలకు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయేతర సిబ్బంది కూడా ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా జ్వర పీడితులు ఎవరు కూడా నమోదు అవ్వలేదని, జలుబు దగ్గుకు 20 మందికి చికిత్స చేయడం జరిగింది. అంతే కాకుండా మిగతా వారికి కూడా చిన్న వ్యాధులకు చికిత్స చేయడం జరిగింది. బాల బాలికలకు ఆరోగ్య విషయాల మీద అవగాహన డాక్టర్ నగేష్ అవగాహన కల్పించారు.విద్యార్థులకు జ్వరము అస్వస్థత వస్తే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురావాలని ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది. ముందుస్తు జాగ్రత్తల చర్యలలో భాగంగా ఆల్ఫా సైపర్ మైత్రిన్ అనే దోమల మందును హాస్టల్ వంటశాల, పాఠశాల ఆవరణ లోపల పిచికారి చేయడం జరిగింది అని డాక్టర్ నగేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ శ్రీనివాస్, సూపర్ వైజర్లు సువర్ణ కుమారి, ఎం ఎల్ హెచ్ ఓ త్రివేణి, ఏఎన్ఎం లు నిర్మల, రజిత పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -