నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతోంది. పంజాగుట్ట, అమీర్‌పేట్, కోఠి, దిల్‌సుఖ్ నగర్, నాగోల్ తోపాటు నగర శివారుల్లో వానాలు భారీగా పడ్డాయి. సిటీలో పలు ప్రాంతాల్లో పడిన భారీ వర్షానికి రోడ్లు జలమైయ్యాయి. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పలు కాలనీల్లో నాలాలు, డ్రైనేజీలు ఉప్పొంగాయి. కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు సమస్యాత్మక ప్రాంతాల్లో వరద నివారణ చర్యలు చేపట్టారు. సిటీలోని ప్రధాన కూడళ్లల్లో ట్రాఫిక్‌ను పోలీసులు క్లియర్ చేస్తున్నారు. మరోవైపు సిటీలో బోనాల జాతర అట్టహాసంగా జరుగుతోంది. ఒక్కసారిగా కురిసిన వానాతో భక్తులు పులకించపోయారు. మే నెల చివరి వారంలో పడిన వర్షాలు..చాలా రోజుల తర్వాత భారీ వర్షం పడడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో భారీ వర్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES