- Advertisement -
ఎరుపెక్కిన పొద్దులో సూర్యుడు
మసకబారుతున్నాడెందుకో..?
విప్లవ సౌందర్య స్ఫూర్తిని
నింపిన రోజును స్మరించి, విస్మరిస్తున్నందుకేనేమో..!
నిప్పు కణంలా ఎగసిపడే కర్షక, కార్మిక లోకం ఉనికిని కోల్పోతున్నాయెందుకో..?
పోరాటానికి ప్రేరణ ఇచ్చిన రోజుకు మరింత పోరాట పటిమను నింపలేనందుకేనేమో..!
గగన సీమలోకి ఎగసిపడిన తారలు ప్రతిధ్వనిస్తున్నాయి
ఎందుకో..?
హక్కుల పోరాటానికి నెత్తుటి తిలకం దిద్దిన రోజు యొక్క లక్ష్యాలు, ఉద్దేశాలు నెరవేరనందుకేనేమో..!
మేడే అంటే ఉత్సవం, ఉద్యమమే కాదు..
మేడే అంటే వర్తమానం
మేడే అంటేనే నిరంతర పోరాటం
– ఈసరి భాగ్యం

- Advertisement -