నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని భిక్కనూర్, జంగంపల్లి, కాచాపూర్, పెద్ద మల్లారెడ్డి, బస్వాపూర్, తిప్పాపూర్, భాగిర్దిపల్లి గ్రామాలలో ఉన్న ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా ఎంఈఓ రాజా గంగారెడ్డి మాట్లాడుతూ జంగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి సహస్ర 576, కేజీబీవీ విద్యార్థి అభి 560, భిక్కనూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి వంశిక 559 ఉత్తమ ఫలితాలు సాధించినట్లు తెలిపారు. అలాగే మండలంలోని అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 391 విద్యార్థులు పరీక్షలు రాయగా 389 విద్యార్థులు ఉత్తీర్నైనట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని 100% ఉత్తీర్ణత సాధించడం పట్ల ఉపాధ్యాయులను, విద్యార్థులను అభినందించారు.
10లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఉత్తమ ప్రతిభ
- Advertisement -
RELATED ARTICLES