- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: దక్షిణ కొరియాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానాలకు పలు చోట్ల నివాస సముదాయాల్లోకి భారీగా వరద నీరు చేరింది. రోడ్లు మొత్తం జలదిగ్భందమైయ్యాయి.
వర్షాల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సియోల్‌కు దక్షిణాన ఉన్న ఒసాన్‌లో కారుపై గోడ కూలడంతో ఒకరు మృతి చెందారని అధికారులు తెలిపారు. మరో చోట కారు నీట మునగడంతో ముగ్గురు మృతి చెందినట్టు చెప్పారు. వరదల నేపథ్యంలో 1,300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాల కారణంగా దక్షిణ కొరియాలో 46 దేశీయ విమానాలను రద్దు చేశారు.
- Advertisement -