నవతెలంగాణ-హైదరాబాద్: పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ సరిహద్దులో పాకిస్థాన్ దేశానికి చెందిన డ్రోన్లను బీఎస్ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాక్‌కు చెందిన ఆరు డ్రోన్లు, పలు రకాల ఆయుధాలను సీజ్ చేశారు. అదే విధంగా సరిహద్దు గ్రామమైన ప్లూమోరన్ లో గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్న హెరయిన్ పంటను అధికారులు గుర్తించారు. పలు రోజులుగా పాక్-ఇండియా బార్డర్‌లో ప్రాంతాల్లో రాత్రి వేళల్లో బీఎస్ఎఫ్ గస్తీ నిర్వహిస్తుంది. ఈక్రమంలో ఆయా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా డ్రోన్లు తోపాటు మాదకద్రవ్యాల నిల్వలను గుర్తించినట్లు మీడియా సమావేశంలో అధికారులు వెల్లడించారు. సాగు చేసిన మాదకద్రవ్యాలను డ్రోన్ల ద్వారా దేశ సరిహద్దులను దాటిస్తున్నారని తెలిపారు.