Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుపది ఫలితాల్లో జిల్లా ఏడవ స్థానం: కలెక్టర్

పది ఫలితాల్లో జిల్లా ఏడవ స్థానం: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : తెలంగాణ రాష్ట్రంలో  పదవ తరగతి  వార్షిక  పరీక్షలలో  మన యాదాద్రి భువనగిరి జిల్లా 7వ స్థానము సాధించడం చాలా ఆనందం కలిగించిందని కలెక్టర్ అన్నారు. 7వ స్థానముకు రావడాని కృషిచేసిన జిల్లా విద్యాధికారికి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన 65 మంది విద్యార్థిని, విద్యార్థులకు సైకిల్ అందజేస్తామని తెలిపారు. అలాగే వారి తల్లిదండ్రులకు సన్మానం చేస్తామన్నారు. జిల్లాలో మంచి ఫలితాలు రావడానికి తీసుకున్న చర్యలు చేపట్టినట్లు ,మార్నింగ్ వేకప్ కాల్ అని ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయుని ద్వారా కాల్ చేయటం జరిగిందనారు. ప్రతి అధికారి ఒక విద్యార్థిని దత్తత తీసుకొని ఆ విద్యార్థి ఎలా చదువుతున్నాడు అని ప్రతి నిత్యం విద్యార్థితో మాట్లాడుతూ.. విద్యార్థికి సూచనలు చేయటం జరిగిందని, ప్రతి నిత్యం జూమ్ మీటింగు ల ద్వారా మండల విద్యాశాధికారి కారులకు, ప్రధానోపాధ్యా యులకు  ఉపాధ్యాయులకు తగు సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. పదవ తరగతి చదువుచున్న వెనుకబడిన విద్యార్ధి ఇంటికి స్వయముగా వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడినట్లు, పదవ తరగతి చదువుచున్న  విద్యార్దులకు వాయిస్ మెసేజి ద్వారా సందేశము అందించినట్లు తెలిపారు.  జిల్లాకు ఏడవ స్థానం కలవడానికి కృషిచేసిన జిల్లా విద్యాశాఖాధికారికి, సిబ్బందికి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు విద్యార్ధిని విద్యార్దులకు , సహకరించిన ఇతర శాఖల అధికారులకు ప్రత్యేక అభినందనలు  తెలిపారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad