Saturday, July 19, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

- Advertisement -

అనారోగ్యంతో చికిత్స పొందుతూ…
నవతెలంగాణ
హైదరాబాద్‌ : టాలీవుడ్‌ నటుడు ఫిష్‌ వెంకట్‌ (53) కన్నుమూశారు. మూత్రపిండ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధ పడుతున్న ఆయన శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. నగరంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. రెండు కిడ్నీలూ చెడిపోవడంతో డయాలసిస్‌ కోసం కుటుంబ సభ్యులు ఆయన్ను కొన్ని రోజుల కిందట ఆస్పత్రిలో చేర్చారు. రెండు కిడ్నీలు మార్పిడి చేయాలని వైద్యులు తెలిపారని ఆయన కుమార్తె ఇటీవల మీడియాకు వెల్లడించిన విషయం తెలి సిందే. వైద్యసేవలు పొందలేని దీనస్థితిలో ఉన్నా మని, దాతలు ఎవరైనా సాయం చేయాలని ఆమె కోరారు. ఇంతలోనే ఆయన మృతి చెందడం విచారకరం. వెంకట్‌ వందకు పైగా చిత్రాల్లో హాస్య నటుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సినీప్రియులను అల రించారు. ఆది, దిల్‌, బన్నీ, అత్తారింటికి దారేది, లక్ష్మీ, చెన్నకేశవరెడ్డి, గబ్బర్‌సింగ్‌, డీజే టిల్లు, కింగ్‌, డాన్‌ శీను, మిరపకారు, దరువు, సుప్రీమ్‌ తదితర హిట్‌ చిత్రాల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చివరి చిత్రం ‘కాఫీ విత్‌ ఏ కిల్లర్‌’.
వెంకట్‌ అసలు పేరు మంగిలపల్లి వెంకటేష్‌. ఆయన స్వస్థలం మచిలీపట్నం. తొలుత ఫిష్‌ వెంకటేశ్‌గా పిలిచేవారు. నటుడు అయ్యాక ఆయన పేరు ఫిష్‌ వెంకట్‌గా మారింది. గతంలో సాదాసీదా చేపల వ్యాపారిగా ఉన్న వెంకట్‌కు 1989లో ఓ మిత్రుడి ద్వారా నిర్మాత మాగంటి గోపినాథ్‌ పరిచయమ్యారు. ఆయన 1991లో నిర్మించిన జంతర్‌ మంతర్‌ చిత్రంలో వెంకట్‌కు తొలిసారి నటించే అవకాశం వచ్చింది. అయితే అప్పట్లో పెద్దగా గుర్తింపు రాకపోయిప్పటికీ నటనపై ఆసక్తితో అడపాదడపా కొన్ని సినిమాల్లో నటించారు. అయితే 2002లో ఎన్టీఆర్‌ హీరోగా వీవీ వినాయక్‌ తీసిన ‘ఆది’ సినిమాతో వెంకట్‌కు గుర్తింపు వచ్చింది. ఆ చిత్రంతోనే సినీ పరిశ్రమలో నిలుదొక్కుకున్నట్టు గతంలో వెంకట్‌ పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో తనకు వీవీ వినాయక్‌ గాడ్‌ఫాదర్‌ అని ఆయన గతంలో పలుమార్లు చెప్పారు. ‘ఆది’ చిత్రంలో వెంకట్‌ పాత్రకు మంచి గుర్తింపు వస్తుందని, ఇండిస్టీలో ఇక వెనక్కి తిరిగే చూసే అవకాశం ఉండదని వీవీ వినాయక్‌ అన్నారట. నటుడు శ్రీహరి తనను ఎంతో ప్రోత్సహించారని, ఆయనతో తనకు ఎంతో అనుబంధం ఉండేదని వెంకట్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం వెంకట్‌ కుటుంబం హైదరాబాద్‌లోని రాంనగర్‌లో నివాసం ఉంటోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -