Saturday, July 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవిధుల్లో ఉండగా గుండెపోటు..

విధుల్లో ఉండగా గుండెపోటు..

- Advertisement -

ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రభుత్వోపాధ్యాయుడు మృతి
నవతెలంగాణ-జగదేవపూర్‌
విధి నిర్వహణలో ఉన్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయునికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. వెంటనే తోటి ఉపాధ్యాయులు ఆయన్ను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మృతిచెందారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌ మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, తోటి ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పట్టిపల్లి గ్రామానికి చెందిన సోమాచారి(55) పీర్లపల్లి గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో మండలంలోని మునిగడప, తిగుల్‌, జగదేవపూర్‌ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేశారు. రోజు మాదిరిగానే శుక్రవారం పాఠశాలకు వచ్చారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో ఛాతిలో నొప్పి వచ్చింది. తోటి ఉపాధ్యాయులకు విషయాన్ని చెప్పారు. వారు జగదేవపూర్‌ మండల కేంద్రంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. నొప్పి తీవ్రమవడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, మండల విద్యాధికారి మాధవరెడ్డి, కాంప్లెక్స్‌ హెచ్‌ఎం సైదులు, ఉపాధ్యాయులు, ఎల్‌ఎఫ్‌ఎల్‌ ప్రధానోపాధ్యాయులు శంకర్‌ మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. ఎంఈఓ మాట్లాడుతూ.. సమయపాలన పాటిస్తూ అంకితభావంతో విధులు నిర్వహించే ఒక మంచి ఉపాధ్యాయుని కోల్పోవడం బాధాకరమన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -