రైతు వద్ద రూ.2 లక్షలు డిమాండ్
నవతెలంగాణ-ములుగు
వివాదాల్లో ఉన్న భూమిని రైతు పేరిట పట్టా చేసి ఇవ్వాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా అత్యాశకు పోయి డబ్బులు డిమాండ్ చేసిన డిప్యూటీ తహసీల్దార్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. సిద్దిపేట జిల్లా మండల కేంద్రంలోని ములుగు తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం ఉమ్మడి మెదక్ జిల్లా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం మీడియాకు డీఎస్పీ వివరాలు వెల్లడించారు. మండలంలోని సింగన్న గూడలో వివాదాల్లో ఉన్న 16 గుంటల భూమిని రైతు పేరిట పట్టాదారు పొజిషన్ కోసం కోర్టు ఉత్తర్వులిచ్చింది. అయితే ఆ భూమిని ప్రాసెస్ చేసి, పాస్‌బుక్ ఇవ్వడానికి ఆర్డీవోకు పంపాల్సి ఉండగా ములుగు డిప్యూటీ తహసీల్దార్ ఎనగందుల భవానీ రైతు నుంచి రూ.2 లక్షలు డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. రైతు ఫిర్యాదు మేరకు కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్‌పై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నట్టు డీఎస్పీ తెలిపారు.
ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES