పాత ఇంటిని కూల్చే క్రమంలో ఘటన
నవతెలంగాణ-మంచిర్యాల
పాత ఇంటిని తొలగించే క్రమంలో గోడ కూలి మీద పడటంతో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో శుక్రవారం జరిగింది. బావనపల్లి గ్రామానికి చెందిన పనకంటి శ్రీనివాస్‌కు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఈ క్రమంలో పాత ఇంటిని కూలగొట్టేందుకు శ్రీనివాస్ కోటపల్లికి చెందిన ఇద్దరు కూలీలను మాట్లాడుకున్నాడు. శుక్రవారం ఇంటిని కూల్చే క్రమంలో గోడ ఒక్కసారిగా కూలి కార్మికులు మధునయ్య, తిరుపతిపై పడింది. తీవ్రంగా గాయపడిన వారిద్దరిని వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలోనే మృతిచెందారు. ఘటన స్థలాన్ని ఎస్‌ఐ రాజేందర్ పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ చెప్పారు.
గోడ కూలి ఇద్దరు కార్మికులు మృతి
- Advertisement -
- Advertisement -