- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్ పంజాగుట్టలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం 5.30 గంటల సమయంలో వేగంగా దూసుకొచ్చిన లారీ పంజాగుట్ట మెట్రో స్టేషన్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అమీర్‌పేట నుంచి ఖైరతాబాద్ వైపు లారీ పురుగుల మందు లోడుతో వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.
డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారని తెలిపారు. లారీలో ఉన్న పురుగుల మందు కాటన్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో లారీని పక్కకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
- Advertisement -