Sunday, July 20, 2025
E-PAPER
Homeక్రైమ్భార్యను చంపి పీఎస్‌లో లొంగిపోయిన భర్త

భార్యను చంపి పీఎస్‌లో లొంగిపోయిన భర్త

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: కట్టుకున్న భార్యను భర్తే అతి కిరాతకంగా హతమార్చిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా చాపాడు మండల పరిధిలోని పెద్ద చీపాడు గ్రామంలో గోపాల్ , సుజాత భార్యభర్తలు కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే భార్య సుజాతకు మరో వ్యక్తితో పరిచయం ఏర్పడితో అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. నిత్యం అతడితోనే ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేది. దీంతో విషయం తెలిసిన గోపాల్ భార్య సుజాతను పద్ధతి మార్చుకోవాలని మందలించాడు.

అయినా, ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విసిగిపోయిన గోపాల్ ఎలాగైన భార్యను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లుగానే రెండు రోజుల క్రితం సుజాతను గుట్టుచప్పుడు కాకుండా ప్రాణాలు తీసేశాడు. తనకు శిక్ష తప్పదని భావించిన గోపాల్ ఇవాళ ఉదయం నేరుగా చాపాడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. భార్య సుజాత డెడ్‌బాడీని సంచిలో కట్టి వనిపెంట అటవీ ప్రాంతంలో పడేసినట్లుగా పోలీసులకు తెలిపాడు. దీంతో వారు అడవిలోకి వెళ్లి డెడీబాడీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -