Sunday, July 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలుచందూనాయక్ హత్య.. నిందితులు అరెస్ట్

చందూనాయక్ హత్య.. నిందితులు అరెస్ట్

- Advertisement -

నవతెలంగాణ- హైదరాబాద్: సీపీఐ కౌన్సిల్ సభ్యుడు చందూనాయక్ (50) హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ హత్యకేసులో మలక్ పేట పోలీసులు ఐదుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా.. ఈ కేసులో శుక్రవారం భాషా, మున్నా, శివని అరెస్ట్ చేశారు. చందునాయక్ ను హత్య చేసింది నలుగురే అయినా.. వారికి మరో ఐదుగురు సహకరించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ప్రధాన నిందితుడైన రాజేష్ తో పాటు ప్రశాంత్, ఏడుకొండలు, సుధాకర్, మున్నా, రాయుడు, రవీంద్రాచారి, యాదిరెడ్డిలను కేసులో నిందితులుగా చేర్చారు. జులై 15న ఉదయం చందునాయక్ శాలివాహన నగర్ పార్కు వద్ద వాకింగ్ చేస్తుండగా నలుగురు దుండగులు అక్కడికి వెళ్లి.. చందు కళ్లలో కారం చల్లి తుపాకీతో ఐదురౌండ్లు కాల్పులు జరిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -