నవతెలంగాణ-హైదరాబాద్: రాజస్థాన్ రాష్ట్రం అజ్మేర్ రైల్వే డివిజన్‌లోని సెంద్రస్టేషన్‌లో గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. రైలు భోగీల్లో పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
కాగా, పెహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సమయంలో భారత్‌కు చెందిన అయిదు యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్థాన్ చెబుతోంది. అయితే పాకిస్తాన్ చెప్పిన దానికి సంబంధించిన ఆధారాలను మాత్రం ఆ దేశం ఇప్పటివరకు బహిర్గంతం చేయలేదు.
యుద్ధ విమానాల కూల్చివేత అంశంలో భారత్ తొలుత ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఇటీవల త్రివిధ దళాల అధిపతి అనిల్ చౌహాన్ మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ వైమానికి దళానికి చెందిన యుద్ధ విమానాలను కోల్పోయినట్లు ఆయన పేర్కొన్నారు. కానీ పాకిస్థాన్ చెబుతున్నట్లు ఆరు విమానాలను కోల్పోలేదన్నారు. అయితే కూలిపోయిన సంఖ్యను మాత్రం ఆయన కూడా వెల్లడించలేదు.