నవతెలంగాణ-హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందుయేతర ఉద్యోగులను తొలగించారు. సంస్థాగత నియమావళిని ఉల్లంఘించారని, హిందూయేతర విశ్వాసాన్ని అనుసరిస్తున్నారని ఆరోపణలతో తిరుపతి దేవస్థానం శనివారం నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసింది. ఈమేరకు టీటీడీ బోర్డు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించింది. క్వాలిటీ కంట్రోల్ విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి.ఎలిజర్, బీఐఆర్డి హాస్పిటల్ స్టాఫ్ నర్స్ ఎస్. రోజి, గ్రేడ్ 1 ఫార్మసిస్ట్ ఎం. ప్రేమావతి, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీ. డాక్టర్ జి. అసుంతలను తొలగించారు.
అయితే ఇటీవల బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్వామివారిని దర్శించుకొని మీడియా సమావేశంలో టీటీడీలో హిందుయేతరులను తొలగించాలని డిమాండ్ చేశారు. తాజాగా నలుగురు హిందుయేతర ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.