ఓఆర్‌ఆర్ బయటకి తరలించాలి
కమర్షియల్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్, మైన్స్ ఆదాయాల్లో పెరుగుదల: క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో
డిప్యూటీ సీఎం భట్టి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాలుష్యకారక పరిశ్రమలన్నిటిని ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలికి తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం హైదరా బాద్‌లోని డాక్టర్ బీఆర్. అంబేద్కర్ సచివాలయం లో క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తంకుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు లతో కలిసి ఆదాయ వనరుల సమీకరణపై సమీక్ష నిర్వహించారు. పరిశ్రమల తరలింపునకు సంబం ధించి విధివిధానాలతో క్యాలెండర్ రూపొందించా లని అధికారులను ఆదేశించారు. రాజీవ్ స్వగృహ పథకం కింద వివిధ దశల్లో ఉన్న ఇండ్లు, హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ఉన్న ఖాళీ స్థలాల విక్రయాలపై సమా వేశంలో చర్చించారు. హౌసింగ్ బోర్డు ఆధ్వ ర్యంలో జరిగే బహిరంగ వేలం ప్రక్రియ పారదర్శ కంగా జరిగేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సబ్ కమిటీ సభ్యులు సూచించారు. సామాన్యులు, మధ్య తరగతి వర్గాలకు ఇండ్లు అందుబాటులో ఉండేలా హౌసింగ్ బోర్డు అధికా రులు చర్యలు చేపట్టాలని సూచించారు. నెల రోజు ల వ్యవధిలో ఆదాయాల పెరుగుదలపై వివిధ శాఖల అధికారులు సమావేశంలో నివేదిక సమ ర్పించారు. కమర్షియల్ టాక్స్‌శాఖలో 1.8, రిజిస్ట్రే షన్ శాఖలో 3.6, గనుల శాఖలో 7శాతం ఆదా యం పెరుగుదల ఉన్నట్టు అధికారులు మంత్రు లకు నివేదించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రదీప్ కుమార్ సుల్తానియా, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ సంజరు కుమార్, గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, మెట్రోపాలిటన్ ఏరియా నగర అభివృద్ధి శాఖ సెక్రటరీ ఇలంబర్తి, హెచ్‌ఎం డీఏ కమిషనర్ సర్పరాజ్, గనుల శాఖ కమిషనర్ శశాంక, కలెక్టర్లు హరిచందన, నారాయణరెడ్డి, వల్లూరు క్రాంతి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
కాలుష్య పరిశ్రమలను
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES