– ఆ ప్రాంత ఎంపీ హమ్దూల్లా సయీద్
కొచ్చిన్: లక్షదీవుల్లో మానవ నివాసాలున్న బిట్రా దీవిని దేశ రక్షణ కోసం ఉపయోగించాలని కేంద్రం నిర్ణయించడాన్ని ఆ ప్రాంత ఎంపీ హమ్దుల్లా సయీద్ తీవ్రంగా నిరసించారు. ఈ సమస్యను పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో లేవనెత్తుతానని అక్కడి ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు. బిట్రా దీవిని రెవెన్యూశాఖ స్వాధీనం చేసుకొని రక్షణ ప్రాజెక్టుకు అప్పగించేలా ఈ నెల 11న నోటిఫికేషను జారీ అయింది. దీవి సర్వేను రెండు నెలల్లో పూర్తిచేస్తామని తెలిపింది. దీవి సేకరణ పారదర్శకంగా చేస్తామనీ, స్థానికులకు తగిన పరిహారం చెల్లిస్తామని తెలిపింది. ఈ అంశంపై గ్రామసభతోసహా సంబంధిత పక్షాలన్నింటితో చర్చిస్తామని నోటిఫికేషను వివరించింది. బిట్రాలో ప్రస్తుతం గ్రామ పంచాయతీ లేదని ఎంపీ సయీద్ తెలిపారు. లక్షద్వీప్‌లో అన్నింటికన్నా చిన్నదీవి బిట్రా. దేశ రక్షణ కోసం ఇతర దీవుల్లో ఇప్పటికే భూముల సేకరణ జరిగిందనీ, ఇప్పుడు బిట్రాను కూడా స్వాధీనం చేసుకోవడం సరికాదని ఎంపీ సయీద్ వాదిస్తున్నారు.
లక్షద్వీప్‌లో రక్షణ ప్రాజెక్టు వద్దు
- Advertisement -
- Advertisement -