- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ :పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత పార్లమెంటు సమావేశాలు జరగడం ఇదే తొలిసారి. ఈ సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్ సహా అనేక అంశాలపై ప్రశ్నల్ని సంధించడానికి విపక్షాలు సన్నద్ధమయ్యాయి. ఆగస్టు 21 వరకు వర్షాకాల సమావేశాలు కొనసాగనున్నాయి. ఆగస్టు 12 నుంచి 17 వరకు స్వాతంత్ర్య దినోత్సవ సెలవు ఉంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం 7 పెండింగ్ బిల్లులకు ఆమోదం తెలపనుంది. 8 కొత్త బిల్లులు ప్రవేశపెట్టనుంది.
- Advertisement -