- Advertisement -
నవతెలంగాణ – వనపర్తి : జూరాల డ్యామ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్యామ్ పై నుంచి వెళ్తున్న బైక్‌ను కారు ఢీ కొట్టింది. బైక్‌పై ముగ్గురు ఉండగా ఓ వ్యక్తి ఎగిరి నదిలో పడిపోయాడు. నదిలో ప్రవాహం ఉండటంతో ఆ వ్యక్తి కొట్టుకుపోయాడు. గల్లంతైన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -