Tuesday, July 22, 2025
E-PAPER
Homeజాతీయంపార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌లు మ‌ధ్యాహ్నానికి వాయిదా

పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌లు మ‌ధ్యాహ్నానికి వాయిదా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: నేడు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల ప్రారంభమైన కొద్దిసేపటికే లోక్‌సభ, రాజ్యసభలు రెండూ మధ్యాహ్నానికి వాయిదాపడ్డాయి. ఈ సమావేశాల్లో ప్రతిపక్ష ఎంపీలు పలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సింధూర్‌పై చర్చించాలంటూ ప్రతిపక్ష నేతలు పట్టుబట్టారు. అయితే ప్రశ్నోత్తరాల సమయంలో వాయిదా తీర్మానాలపై చర్చ పెడతామని స్పీకర్‌ ఓంబిర్లా చెప్పినప్పటికీ ఎంపీలు వినిపించుకోలేదు. దీంతో సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో.. తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్యే లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేస్తున్నట్లు స్పీకర్‌ ప్రటించారు.

కాగా, రాజ్యసభలో నామినేటెడ్‌ సభ్యులు మీనాక్షి జైన్‌, సదానందన్‌ మాస్టర్‌, హర్షవర్ధన్‌ ష్రింగ్లాతోపాటు, అస్సాం సభ్యులు బీరేంద్ర ప్రసాద్‌ బైశ్యా, బిజెపికి చెందిన కనద్‌ పుర్కాయస్థలు రాజ్యసభలో ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేశారు. నేడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పుట్టినరోజు. దీంతో సభ రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జునఖర్గేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ఖర్గే పహల్గామ్‌ ఉగ్రదాడి, ఆపరేషన్‌ సింధూర్‌పై 267 కింద నోటీ ఇచ్చానని చెప్పారు. దాడికి పాల్పడిన వారిని ఇంతవరకు పట్టుకోలేదని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. అలాగే ఆపరేన్‌ సిందూర్‌ సమయంలో ప్రతిపక్షం ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -