నవతెలంగాణ-హైదరాబాద్ : రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో నకిలీ నోట్ల ముద్రణ యంత్రం నడుపుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.7.5 లక్షల నకిలీ నోట్లను, కరెన్సీ ముద్రణకు ఉపయోగించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మండోర్ మండీలో నిర్వహిస్తున్న ఈ నకిలీ నోట్ల ముద్రణతో జోధ్‌పుర్ పరిసర ప్రాంతాల్లో రూ.500 నకిలీ కరెన్సీ నోట్ల చలామణి జోరుగా సాగుతోంది. పక్కా సమాచారంతో పోలీసులు ప్రింటింగ్ ప్రెస్‌పై దాడులు జరిపి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులిద్దరినీ బాల్ సమంద్‌లోని వారి ఇళ్లకు తీసుకువెళ్లి, అక్కడ కూడా సోదాలు చేశారు. ఎవరైనా రూ.2 లక్షల అసలు నోట్లను ఇస్తే.. రూ.10 లక్షల నకిలీ రూ.500 నోట్లను నిందితులు ఇస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ‘‘మండోర్ మండీలో కొంతకాలంగా నకిలీ నోట్లు చలామణి అవుతున్నట్లు సమాచారం ఉంది. దీంతో ఒక ప్రత్యేకబృందాన్ని నియమించి నాగౌర్ జిల్లాలోని పంచోడికి చెందిన రాజేంద్ర వ్యాస్ (28), భవండా వాసి హనుమాన్రామ్ ప్రజాపత్ (40)లను అరెస్టు చేశాం. వారి నుంచి నకిలీ నోట్లతోపాటు కంప్యూటర్, స్కానర్, సిరా, కాగితం వంటి సామగ్రిని స్వాధీనం చేసుకున్నాం’’ అని డీసీపీ ఆలోక్ శ్రీవాస్తవ తెలిపారు.
రాజస్థాన్‌లో నకిలీ నోట్ల ముద్రణ
- Advertisement -
RELATED ARTICLES