Thursday, May 1, 2025
Homeతాజా వార్తలు తెలంగాణ ఇంటర్ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల..

 తెలంగాణ ఇంటర్ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల..

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ 10వ తరగతి పరీక్షల ఫలితాల విడుదల నేపథ్యంలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియెట్ అడ్మిషన్ల కోసం ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025-26 సంవత్సరానికి అకాడమిక్ షెడ్యూల్ విడుదల చేసింది.
దీని ప్రకారం.. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీల్లో మే 1 నుంచి మే 31 తారీకు వరకు కాలేజీల్లో దరఖాస్తులు చేసుకునేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు అవకాశం కల్పిస్తోంది. ఇంటర్మీడియట్ అడ్మిషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని ఆదేశాల్లో పేర్కొంది.
ప్రతి కాలేజీలో ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 10శాతం, బీసీలకు 29శాతం, దివ్యాంగులకు 5శాతం స్పోర్ట్స్ కోట కింద 5శాతం, ఎక్స్ ఆర్మీ, డిఫెన్స్ పిల్లలకు 3శాతం, ఈడబ్ల్యుసీ కోట కింద 10శాతం సీట్లు కేటాయించాలని ఆదేశించింది.
ఇంటర్మీడియట్‌లో విద్యార్థుల అడ్మిషన్ కోసం ఎలాంటి పరీక్షలు నిర్వహించవద్దని కాలేజీలను ఇంటర్ బోర్డు ఆదేశించింది. టెన్త్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా అడ్మిషన్స్ కల్పించాలని సూచించింది.
అంతేకాదు.. అనుమతి ఉన్న మేరకే సెక్షన్స్ నిర్వహించాలని, ఒక్క సెక్షన్‌లో 88 మంది విద్యార్థులకు మాత్రమే అవకాశం కల్పించాలని పేర్కొంది. ఇన్‌స్ట్రక్షన్స్ పాటించని కాలేజీలపై కఠినమైన చర్యలు ఉంటాయని తెలంగాణ ఇంటర్ బోర్డు హెచ్చరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img