Tuesday, July 22, 2025
E-PAPER
Homeనల్లగొండనేడే జిఎంపిఎస్ జిల్లా మహాసభలు...

నేడే జిఎంపిఎస్ జిల్లా మహాసభలు…

- Advertisement -

ముఖ్య అతిథులుగా హాజరుకానున్న గోపాల్,  రవీందర్..          

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ 

జూలై 22న రాయిగిరి లింగ బసవ గార్డెన్లో జరిగే గొర్రెలు,మేకల పెంపకందారుల సంఘం  యాదాద్రి భువనగిరి జిల్లా 3వ మహాసభలుగొర్లు, మేకలకు మేత,నీరు,వైద్యం,గొర్రెలకు భీమా,గొర్ల కాపరులకు 50సం.లకు పింఛన్లు,సబ్సిడీ రుణాలు, ఎన్ సి డి సి   రుణాలు మాఫీ,ఎక్స్గ్రేషియో,చదువుకున్న యువతీ,యువకులకు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్   స్కీములో ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నారు.  సమస్యలపై జిఎంపిఎస్ పోరుబాట గొల్ల కుర్మల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న ఏకైక సంఘం గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం రెండో విడత గొర్ల పంపిణీ నగదు బదిలీ ద్వారా అమలు చేస్తామని కామారెడ్డి బిసి డిక్లరేషన్ కాంగ్రెస్ మేనిఫెస్టో 15,16 పేజిలలో రెండు లక్షల నగదు బదిలీ అధికారంలోకి వచ్చిన మూడు నెలలలో చేస్తామని పేర్కొన్నారు. అధికారం చేపట్టి 18 నెలలు అయినా అమలు చేయడం లేదు,పదేళ్లుగా సొసైటీలకు ఎన్నికలు జరగలేదనారు.రెండున్నర సం.లుగా గొర్రెలు,మేకలకు డీవార్మింగ్,8నెలలుగా మందుల సరఫరా పూర్తిగా నిలిచి పోయింది.తొమ్మిది నెలలుగా గోపాలమిత్రలకు వేతనాలు ఇవ్వడం లేదు.రోగాలతో గొర్లు మేకలు చనిపోతున్నాయి. ప్రభుత్వం నుండి ఎలాంటి మందులు అందడం లేదు. వెంటనే సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం ప్రవేశపెట్టాలి ప్రభుత్వం వెంటనే సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం ప్రవేశపెట్టాలని, సకాలంలో మూగజీవాలకు వైద్యం అందించాలని, ప్రభుత్వ మందులు సరిపడా చేయాలని  జి ఎం పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దేపురం రాజు కోరారు. జిల్లా మహాసభలకు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ లో గొర్రెల మేకల వృత్తిదారులకు  అనుకూలంగా మార్గదర్శకాలు రూపొందించాలని డిమాండ్ చేశారు.

 ముఖ్య అతిథులుగా హాజరుకానున్న  గోపాల్,  రవీందర్..          

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -