– దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
నవతెలంగాణ- రాయపోల్ : మార్కండేయ స్వామి ఆశీస్సులతో రాయపోల్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో బాగుండాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం రాయపోల్ మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన మార్కండేయ స్వామి దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయపోల్ మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నూతనంగా శ్రీ మార్కండేయ స్వామి దేవాలయం నిర్మించుకోవడం శుభ పరిణామమని పద్మశాలి సంఘం సభ్యులు ఐక్యమత్యంతో కలిసిమెలిసి ఉంటారని ఎప్పుడు వారి పట్ల మాకు గౌరవం ఉంటుందన్నారు. రాయపోల్ మండల ప్రజలు మార్కండేయ స్వామి ఆశీస్సులతో పాడి పంటలు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకోవడం జరిగిందన్నారు. రాయపోల్ లో మార్కండేయ స్వామి ఆలయ నిర్మించినందుకు పద్మశాలి సంఘం సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, గల్వ యాదవ రెడ్డి, ఇప్ప దయాకర్, గల్వ దయాకర్ రెడ్డి, పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మార్కండేయ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ బాగుండాలి
- Advertisement -
RELATED ARTICLES