- Advertisement -
సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు విఎస్ అచ్యుతానందన్ మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. కార్మికుల సమస్యలపై ఉద్యమాలను నిర్మించారని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దానివల్ల ఆయన ప్రజానాయకుడిగా ఎదిగారని వివరించారు. అచ్యుతానందన్ కేరళ ముఖ్యమంత్రిగా పనిచేసినపుడు ప్రగతి సాధించిందని గుర్తు చేశారు. ప్రజలకు విలువలతో కూడిన సేవ చేశారని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
- Advertisement -