కార్యకర్తలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్‌ఎస్ కార్యకర్తలు సిద్ధం కావాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో త్వరలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలకు అయన పలు సూచనలు చేశారు. సమావేశాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ మాజీ చైర్మెన్లు, సీనియర్ నేతలు పాల్గొనెలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీను అమలుచేయకుండా కాంగ్రెస్ చేస్తున్న మోసాలతో పాటు రేవంత్ ప్రభుత్వ అవినీతి, అప్రజాస్వామిక విధానాలు, వైఫల్యాలను గ్రామగ్రామాన ప్రచారం చేయాలన్నారు. రైతు బంధు ఇవ్వకుండా అన్నదాతలకు చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరించాలన్నారు. అన్ని వర్గాల ప్రజల తరఫున గత 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్‌ఎస్ చేస్తున్న ప్రజా పోరాటాలు, నిరసన కార్యక్రమాలను ప్రజలకు గుర్తుచేసేలా పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేయాలని సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES