Wednesday, April 30, 2025
Homeజాతీయంఆందోళన కలిగిస్తున్న మరణశిక్షలు

ఆందోళన కలిగిస్తున్న మరణశిక్షలు

– దిగువ కోర్టుల్లో ఇలాంటి తీర్పులు అధికం
– సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలి
– నిబంధనలను పరిగణలోకి తీసుకోవాలి : పలువురు న్యాయ నిపుణులు, మేధావులు
దోషులకు విధించే మరణశిక్షపై ఎప్పటి నుంచో దేశంలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. మరణశిక్షను రద్దు చేయాలనే డిమాండ్లూ వినిపించాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు కూడా ఈ మరణశిక్షను రద్దు చేశాయి. అయితే, భారత్‌లో మాత్రం మరణశిక్ష ఇప్పటికీ ఉనికిలోనే ఉన్నది. అత్యంత తీవ్రమైనదిగా పరిగణించబడే ఈ శిక్ష విషయంలో దిగువ కోర్టుల తీర్పులపై మేధావులు, న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ఇతర నిబంధనలను పాటించే విషయంలో అనుమానాలను వెలిబుచ్చుతున్నారు.
న్యూఢిల్లీ:
2024లో పశ్చిమ బెంగాల్‌లోని ఆర్జీకార్‌ ఆస్పత్రి ఉదంతం కేసులో నిందితుడికి మరణశిక్ష విధించాలనే డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపించాయి. ఆ తర్వాత సీల్దా సెషన్స్‌ కోర్టు మాత్రం మరణశిక్ష కాకుండా.. జనవరి 20న దోషిగా తేలిన సంజరు రారుకి జీవిత ఖైదు విధించింది. ఇక కేరళలోని నెయ్యట్టింకర అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు.. తన ప్రియుడిని హత్య చేసిందన్న ఆరోప ణలపై దోషిగా తేలిన గ్రీష్మ అనే యువతికి మరణశిక్షను విధించింది.
ఈ రెండు సందర్భాలలోనూ కోర్టులు నిందితుల పరిస్థితులను పరిగణలోకి తీసుకోవటంలో విఫలమ య్యాయని నేషనల్‌ లా యూనివర్సిటీకి చెందిన క్రిమినల్‌ జస్టిస్‌ రీసెర్చ్‌ అండ్‌ లిటిగేషన్‌ సెంటర్‌ ప్రాజెక్ట్‌-39ఏ డైరెక్టర్‌ నీతికా విశ్వనాథ్‌ అన్నారు. ఇది శిక్ష విధించేటపుడు నింది తుల న్యాయమైన విచారణ హక్కులను లోతుగా పరిగణలోకి తీసుకు న్నట్టుగా కనిపించలేదని చెప్పారు. రెండు కేసులలో నిర్ణయాలు ఏకపక్షంగా జరిగాయన్న అనుమానాలను వ్యక్తం చేశారు. మరణ శిక్షకు తగ్గించే, తీవ్రతరంచేసే అంశాల గురించి తెలుసుకోవాలని సుప్రీం కోర్టు.. దిగువ కోర్టులను కోరినప్పటికీ.. ట్రయల్‌కోర్టులు 2024లో జరిగిన అన్ని మరణశిక్షలలో నిందితుల గురించి ఎలాంటి సమా చారాన్నీ తెలుసుకోకపోవటం ఆందోళనకరమని అంటున్నారు. భారత్‌లో సుప్రీంకోర్టు వరుసగా రెండో ఏడాది ఎలాంటి మరణ శిక్షనూ నిర్ధారించలేదు. దీంతో 2024 చివరి నాటికి దేశంలో 564మంది మరణశిక్ష కింద జీవిస్తున్నారు. ట్ర యల్‌ కోర్టుకు మరణశిక్ష విధించే అధికారా లను మార్గనిర్దేశం చేసే చట్టంలో స్పష్టత లేక పోవటం, శిక్ష విధించేముందు ట్రయల్‌ కోర్టు ల పరిశీలన కోసం మరణశిక్ష పడిన ఖైదీల సమా చారాన్ని సేకరించటం వంటి సమస్య లను పలువురు న్యాయ నిపుణులు ఎత్తిచూపుతు న్నారు. ప్రపంచవ్యాప్తంగా 113 దేశాలు మరణశిక్షను రద్దుచేసిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.2000 ప్రారంభం నుంచి 15 ఏండ్లతో పోలిస్తే.. 2016 నుంచి 2024 మధ్య ట్రయల్‌ కోర్టులు ప్రతి ఏటా సగటున 32 మరణశిక్షలు విధించాయి. ఇక సెషన్స్‌ కోర్టులు 2024 వరకు తొమ్మిదేండ్లలో 1180 శిక్షలను విధించగా.. 2000 నుంచి 2015 మధ్య విధించినవి 1486 ఉన్నాయి. మరణశిక్ష విధించటంలో ట్రయల్‌ కోర్టుల విధానాన్ని మార్చటానికి నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (నల్సా) కూడా జోక్యోం చేసుకోవాలని మానవ హక్కుల న్యాయవాది కాలిన్‌ గోన్సాల్విస్‌ అన్నారు. 2024లో, మరణశిక్ష పడిన ప్రతి నలుగురిలో దాదాపు ఒకరు భారత్‌లోనే అత్యధిక జనాభా కలిగిన యూపీ(130 మంది) లోనే ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్‌ (71), మహారాష్ట్ర (42), పశ్చిమ బెంగాల్‌ (37)లు ఉన్నాయి. 2024లో యూపీ సెషన్స్‌ కోర్టులు 34 మరణశిక్షలను విధించాయి. ఇది దేశంలోనే అత్య ధికం. 2016 నుంచి రాష్ట్ర సగటు కంటే ఎక్కువ. 2021 నుంచి 2024 మధ్య యూపీ సెషన్స్‌ కోర్టులు ప్రతి ఏటా కనీసం 33 మంది దోషులకు మరణ శిక్షలు విధించటం గమనార్హం. ఆ తర్వాత కేరళలో 20 మరణ శిక్షలు విధించబడ్డాయి. 1980 బచన్‌ సింగ్‌ తీర్పు ప్రకారం.. మరణశిక్ష విధించేముందు నేరం పరిస్థి తులు, నేరస్థుడిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్గదర్శకాలు సూచనాత్మకంగా ఉన్నాయని ప్రాజెక్ట్‌ 39ఏ నివేదిక పేర్కొన్నది. మరణశిక్ష విధించేందుకు ట్రయల్‌కోర్టు విచ క్షణ, అధి కారాలను మార్గనిర్దేశం చేసే చట్టం అస్పష్టంగా ఉన్నదని మీనన్‌ అన్నారు. గతేడాది జులై నుంచి భారత్‌లో కొత్త క్రిమినల్‌ చట్టాలు అమలులోకి వచ్చిన విషయం విదితమే. అయితే, ఈ చట్టాలతో మరణశిక్ష పరిధి విస్తృతమైందని మేధావులు అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img