నవతెలంగాణ- హైదరాబాద్: భారతదేశాన్ని ప్రగతి పథంలో ముందుండి నడుపుతున్న కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. ఇండియా ఆర్థిక వ్యవస్థకు ప్రగతి చక్రాలు కార్మికులని ఆయన కొనియాడారు. వాళ్ల సేవలు, త్యాగాలు, నైపణ్యాలు వెలకట్టలేనివని చెప్పారు. నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా.. భారతదేశ పురోగతిలో వారికి న్యాయమైన వాటా లభించేలా చూసుకోవాలనే నా సంకల్పాన్ని నేను పునరుద్ఘాటిస్తున్నాను” అని ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
- Advertisement -