Wednesday, July 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఓయూ క్యాంపస్‌ను 'క్లోజ్డ్‌'గా మార్చాలి

ఓయూ క్యాంపస్‌ను ‘క్లోజ్డ్‌’గా మార్చాలి

- Advertisement -

విద్యార్థుల నిరసన
నవతెలంగాణ-ఓయూ

ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని క్లోజ్డ్‌ క్యాంపస్‌గా మార్చాలని ఓయూ విద్యార్థులు డిమాండ్‌ చేశారు. విద్యార్థులు మంగళవారం ఆర్ట్స్‌ కళాశాల ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. క్యాంపస్‌లోకి బయటి వ్యక్తులు వచ్చి మద్యం పార్టీలు, అసాంఘిక కార్యకలాపాలు చేస్తుండటంతో విద్యా వాతావరణం తీవ్రంగా ప్రభావితమ వుతోందని తెలిపారు. అందువల్ల యూనివర్సిటీలోకి ప్రయివేటు వ్యక్తులు రాకుండా క్లోజ్డ్‌ క్యాంపస్‌ చేయాలని కోరారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థులను అరెస్టు చేసి లాలాగూడ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఓయూ క్యాంపస్‌లో సోమవారం బయటి నుంచి వచ్చిన కొంతమంది యువకులు మద్యం సేవించి విద్యార్థులపై దాడి చేసినట్టు విద్యార్థులు ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -