Thursday, July 24, 2025
E-PAPER
Homeజాతీయంపాకిస్థాన్ విమానాల‌పై నిషేధాన్ని పొడిగించిన భార‌త్‌

పాకిస్థాన్ విమానాల‌పై నిషేధాన్ని పొడిగించిన భార‌త్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భారత్ తన గగనతలాన్ని ఉపయోగించి పాకిస్థాన్ నడిపే విమానాలపై నిషేధాన్ని పొడిగించింది. ఆగస్టు 23 వరకు పాక్‌ విమానాలు భార‌త‌ గగనతలంలోకి ప్రవేశించకుండా బ్యాన్‌ను పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌)లో ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు.

“పాకిస్థాన్ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించకుండా పరిమితం చేస్తున్న ఎయిర్‌మెన్ నోటీసు (NOTAM)ను అధికారికంగా ఆగస్టు 23 వరకు పొడిగించడం జ‌రిగింది. ప్రస్తుత భద్రతా ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఇది ఉంటుంది” అని మంత్రి తెలిపారు.

మొద‌ట‌ ఈ నెల‌ 24 వరకు పాకిస్థాన్ విమానాలకు భారత్‌ తన గగనతలాన్ని మూసివేసింది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో ఇండియా తొలుత‌ ఏప్రిల్ 30న ఈ ఆంక్షలను విధించింది. ఆ త‌ర్వాత ఈ బ్యాన్‌ను జులై 24 వ‌ర‌కు పొడిగించింది. ఈ గ‌డువును ఇప్పుడు మ‌ళ్లీ ఆగ‌స్టు 23 వ‌ర‌కు పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -