Friday, May 2, 2025
Homeజిల్లాలుఈదురు గాలుల బీభత్సం.! 

ఈదురు గాలుల బీభత్సం.! 

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల, మల్లారం, పెద్దతూండ్ల గ్రామాల్లో బుదవారం అర్ధరాత్రి అకాలంగా విచిన ఈదురు గాలులు బీభత్సం సృష్టించడంతో రైతులు, ప్రజలు అతలాకుతలం అయ్యారు. తాడిచెర్లలో మామిడి తోటల్లో చెట్లపై ఒక్క కాయలేకుండా నెలరాలాయి. రేకుల షెడ్ల ఇండ్లపై రేకులు ధ్వంసం అయ్యాయి. ఇంటి గోడలు నేలమట్టం అయ్యాయి. పెద్దపెద్ద వృక్షాలు నేలకొరిగాయి. కరెంట్ స్తంభాలు విరిగిపోయి, తీగలు తెగిపడ్డాయి. కోతకు ఉన్న పొలాలు నేలమట్టం కావడమే కాకుండా వరి గింజలు చేతికి రాకుండా రాలాయి. కొనుగోలు కేంద్రాల్లో రైతులు అమ్ముకోవడానికి  పోసిన ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. ప్రకృతి ప్రకోపంతో రైతులకు ఒకవైపు పంటల నష్టం, మరోవైపు ఇండ్లు ధ్వంసమవడంతో రైతులు కన్నీరుమున్నీరైయ్యారు. ఆరుగాల కష్టం అందకుండా పోయి తీరని నష్టం జరిగిందని రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులతో సర్వేలు చేయించి పంట నష్టపరిహారం అందజేయాలని కోరుతున్నారు. లేదంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. విద్యుత్ సరఫరా నిలిపిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img