Friday, July 25, 2025
E-PAPER
Homeకరీంనగర్కంప్యూటర్ ఆపరేటర్ల ఉద్యోగ భద్రత కొరకు ఎంపీడీవో కు వినతి

కంప్యూటర్ ఆపరేటర్ల ఉద్యోగ భద్రత కొరకు ఎంపీడీవో కు వినతి

- Advertisement -

నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండలంలోని ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని కోరుతూ, బుధవారం ఎంపీడీవో కృష్ణ ప్రసాద్, ఎంపీఓ ప్రభాకర్,లకు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గుర్రం అనుదీప్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా తమతో వెట్టిచాకిరి చేయించుకుంటున్న ప్రభుత్వాలు తమ సమస్యల పరిష్కారం పట్ల శ్రద్ధ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా 22, వేల 750 వేతనం పొందుతున్న తమకు ప్రస్తుతం కేవలం 19 వేల 500 మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు.
తమ సమస్యల పరిష్కారం కోసం మరియు భవిష్యత్ కార్యాచరణపై చర్చించుటకు హైదరాబాద్‌లోని కమిషనరేట్ కార్యాలయానికి వెళ్ళేందుకు ఒక్కరోజు సెలవు అనుమతి ఇవ్వాలని ఆయన ఎంపీడీవోను కోరారు.ఈ కార్యక్రమంలో కంప్యూటర్ ఆపరేటర్లు నాంపల్లి వెంకటేష్, గొడిశాల శ్రీనివాస్, గుర్రం స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -