నవతెలంగాణ- హైదరాబాద్: నకిలీ ఓట్లను కట్టడి చేయడానికి ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బోగస ఓట్ల ఏరివేతే లక్ష్యంగా మూడు విధానాలను కమిషన్ సభ్యులు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితాను అనుసంధానం చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి మరణాల సమాచారాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో ఎప్పటికప్పుడు తీసుకుంటామని వెల్లడించింది. చనిపోయిన వారి కుటుంబీకుల నుంచి విజ్ఞప్తి వచ్చేంతవరకు వేచి చూడకుండా.. ఆర్‌జీఐ నుంచి సమాచారం వచ్చిన వెంటనే బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి సమాచారాన్ని ధ్రువీకరించుకుంటారు’’ అని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఓటరు సమాచార చీటీ మరింత స్పష్టంగా కనిపించేందుకు వీలుగా దాని డిజైన్‌ను మార్చాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. సీరియల్ నంబర్, పార్టు నంబర్ల సైజును పెంచనున్నట్లు తెలిపింది. తద్వారా ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్లను తేలికగా గుర్తించడంతోపాటు అటు పోలింగ్ అధికారులకు కూడా జాబితాలోని పేర్లను సులభంగా సరిచూసుకునే వీలుంటుంది. దీంతోపాటు బూత్ స్థాయి అధికారులకు కూడా ఫొటో ఐడీ కార్డులను జారీ చేయనున్నట్లు ఈసీ వెల్లడించింది.
భారత్ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
- Advertisement -
RELATED ARTICLES