నవతెలంగాణ- హైదరాబాద్: హోటల్స్, రెస్టారెంట్స్‌ల్లో వినియోగించే వాణిజ్య సిలిండర్లపై రూ.14.50 తగ్గించినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.1,747.50 కాగా, ముంబయిలో రూ.1,699కి చేరింది. ఏప్రిల్ 1న వాణిజ్య సిలిండర్‌పై రూ.41 తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే గృహాల్లో వినియోగించే వంట గ్యాస్ ధరలో ఎటువంటి మార్పు లేదు. 14.2 కేజీవ వంట గ్యాస్ ధర రూ.853గా ఉంది. గత నెల ఈ సిలిండర్‌పై రూ. 50 పెంచిన సంగతి తెలిసిందే. విమాన ఇంధన ధర (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ – ఎటిఎఫ్)ను కూడా తగ్గించినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్ల ప్రకారం.. ఢిల్లీలో కిలో లీటరుకు 4.4శాతం లేదా రూ.3,954 తగ్గించింది. దీంతో కిలో లీటర్ విమాన ఇంధన ధర ప్రస్తుతం 85,486.80కి చేరింది. ఏప్రిల్1న విమాన ఇంధన ధరను 6.15 శాతం తగ్గించింది.
వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై రూ.14.50 తగ్గింపు
- Advertisement -
RELATED ARTICLES