Friday, May 2, 2025
Homeతెలంగాణ రౌండప్ఘనంగా మేడే వేడుకలు..

ఘనంగా మేడే వేడుకలు..

నవతెలంగాణ – కంఠేశ్వర్ 

నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కటారి రాములు అన్నారు. ఈ మేరకు గురువారం తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్ టి డబ్ల్యూ ఎఫ్ – సిఐటియు) ఆటో యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక మినీ ట్యాంక్ బండ్ , మరియు వినాయక్ నగర్, ఆటో స్టాండ్ వద్ద ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కటారి రాములు జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మే డే దినోత్సవం సందర్భంగా ప్రపంచ కార్మికులారా ఏకంకండి అనే నినాదాన్ని ఎలుగెత్తి చాటాలని ఆయన కోరారు. అదేవిధంగా చికాగో నగరాన ఎనిమిది గంటల పని విధానం కోసం ఎర్ర జెండా కొట్లాడిందని, దీనిని కార్మికులు ప్రజలు మరచిపోకూడదని ఆయన అన్నారు. కానీ ప్రస్తుత పాలకులు ఎనిమిది గంటల పని విధానాన్ని తొలగించి 12 గంటల పని విధానన్ని తీసుకురావడం బాధాకరమని అన్నారు . అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను కాలరాస్తే ప్రభుత్వాలు కూలిపోక తప్పదని అన్నారు. బానిసలను విముక్తి చేయడమే ఎర్ర జెండా కర్తవ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్యాంక్ బండ్ ఆటో యూనియన్ అధ్యక్షులు సయ్యద్ రఫీ యుద్దీన్, నగర అధ్యక్షు టి కృష్ణ, జావిద్ ఖాన్, కిషన్, విట్టల్, ముకుంద, శంకర్, రవి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img