నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరకొరియా, రష్యాల మధ్య మొదటి రోడ్ లింక్ కోసం బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించినట్లు ఇరు దేశాల మీడియాలు గురువారం ప్రకటించాయి. ఉత్తర కొరియా ప్రధాని పాక్ థేసాంగ్, రష్యా ప్రధాని మిఖాయిల్‌లు ఈ కార్యక్రమానికి హాజరైనట్లు తెలిపాయి. బ్రిడ్జి నిర్మాణం ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత విస్తరించే ఒక ప్రధాన అభివృద్ధి మార్గంగా ఇరు దేశాల ప్రధానులు అభివర్ణించారు. ద్వైపాక్షిక సంబంధాలలో బ్రిడ్జి నిర్మాణం ఒక స్మారక చిహ్నంగా గుర్తుండిపోతుందని పాక్ థేసాంగ్ పేర్కొనగా, రష్యా -ఉత్తర కొరియా సంబంధాలకు ఇది ఒక మైలురాయి మిఖాయిల్ తెలిపారు. కిలోమీటరు పొడవు వుండే ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని ఒకటిన్నర ఏడాదిలోపు పూర్తి చేయాలని అంచనా వేసినట్లు ఇరుదేశాలు ప్రకటించాయి. ఈ బ్రిడ్జి ప్రజల మధ్య దూరాన్ని తగ్గించడంతో పాటు పర్యాటకాన్ని వ్యాప్తి చేస్తుందని తెలిపాయి. ఇరుదేశాలను కలుపుతూ ఇప్పటికే ఒక రైల్వే బ్రిడ్జి, వైమానిక సేవలు కొనసాగుతున్నాయి. రష్యా మరియు చైనాల మధ్య ఉత్తరకొరియా సరిహద్దుల వెంబడి ప్రవహించే తుమెన్ నదిపై ఆటోమొబైల్ కోసం వంతెనను నిర్మించడానికి ఇరు దేశాలు గతేడాది జూన్‌లో అంగీకరించాయి.
రష్యా, ఉత్తర కొరియాల మధ్య ప్రారంభమైన మొదటి రోడ్ లింక్
- Advertisement -
RELATED ARTICLES