Wednesday, April 30, 2025

ఆగస్టులో ఆశాల సమ్మె
– వేతన పెంపును అమలు చేయాలని డిమాండ్‌
– బీజేపీ ఎంపీ ఇండ్లు, కార్యాలయాల ఎదుట ఆందోళన
– మే 20న సార్వత్రిక సమ్మెలోనూ ఆశా వర్కర్లు
– ఏడబ్ల్యూఎఫ్‌ఎఫ్‌ఐ జాతీయ కన్వెన్షన్‌లో నిర్ణయం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంటులో ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ప్రకటించిన వేతన పెంపును అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆశా వర్కర్లు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా వారు ఆగస్టులో సమ్మెలోకి వెళ్లనున్నారు. బీజేపీ ఎంపీల ఇండ్లు, కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టనున్నారు. మే20న జరిగే అఖిల భారత సార్వత్రిక సమ్మెలోనూ ఆశా వర్కర్లు పాల్గొననున్నారు. ఆశా వర్కర్క్‌ అండ్‌ ఫెసిలిటేటర్ల సమాఖ్య (ఏడబ్ల్యూఎఫ్‌ఎఫ్‌ఐ) జాతీయ కన్వెన్షన్‌ శనివారం నాడిక్కడ హరికిషన్‌ సింగ్‌ సుర్జీత్‌ భవన్‌లో జరిగింది. ”రెండు దశాబ్దాల ఎన్‌హెచ్‌ఎం – సవాళ్లు, పోరాటాలు, విజయాలు, ముందుకు సాగే మార్గం” అనే అంశంపై జరిగిన ఈ కన్వెన్షన్‌లో కొనసాగుతున్న పోరాటాలను తీవ్రతరం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు.
ఆశా వర్కర్లు, ఫెసిలిటేటర్లకు చట్ట బద్ధమైన వేతనాలు, సామాజిక భద్రత, పెన్షన్‌, గౌరవప్రదమైన జీవితం, భారతదేశ ప్రజలకు సార్వత్రిక నాణ్యమైన ప్రజా ప్రాథ మిక ఆరోగ్య సంరక్షణ హక్కు కోసం పోరా టాలను ప్రకటించింది. సంఘం జాతీయ ఉపాధ్యక్షురాలు వీణా గుప్తా సంతాప తీర్మా నాన్ని ప్రవేశపెట్టారు. ఈ సదస్సును సీఐ టీయూ జాతీయ అధ్యక్షురాలు కె. హేమలత ప్రారంభించారు. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఆమె వివరించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆశా కార్మికులు చేసిన పోరాటాలను అభినందించారు. తమ పోరాటాలను తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా పోరాడి, మే 20న జరిగే అఖిల భారత సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు. ముగింపు ప్రసంగంలో ఎఆర్‌ సింధు ఆశా వర్కర్లు, ఇతర స్కీమ్‌ వర్కర్ల భవిష్యత్తు కార్యాచరణను వివరించారు. ఏడబ్ల్యూఎఫ్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి మధుమిత బందోపాధ్యాయ ముసాయిదా డిక్లరేషన్‌ను ప్రవేశపెట్టారు. ఈ సదస్సులో సోదర సంఘాల నాయకులు పి.కృష్ణప్రసాద్‌ (ఏఐకేఎస్‌), మరియం ధావలే (ఐద్వా) ఆశాల పోరాటాలకు సంఘీభావం, మద్దతు తెలిపారు. ఈ సమావేశ అధ్యక్ష వర్గంలో ఏడబ్ల్యూఎఫ్‌ఎఫ్‌ఐ అధ్యక్షు రాలు పి.పి. ప్రేమ, వీణా గుప్తా, సునీతా రాణి, డెల్షాడ (జమ్ము కాశ్మీర్‌), ఆనంది (మహారాష్ట్ర), లోకేష్‌ రాణి (ఉత్తరాఖండ్‌), హసుమతి (గుజరాత్‌) ఉన్నారు. వివిధ రాష్ట్రాల నాయకులు ఈ డిక్లరేషన్‌పై చర్చిం చారు. పి.పి ప్రేమ (జాతీయ అధ్యక్షురాలు), సురేఖ (హర్యానా), పుష్ప (మహారాష్ట్ర) ఫిర్దౌసి (జమ్ము కాశ్మీర్‌), సంగీత (ఉత్తరప్రదేశ్‌) మాట్లా డారు. ఏడబ్ల్యూఎఫ్‌ఎఫ్‌ఐ అధ్యక్షురాలు ఉషా రాణి, రాజస్థాన్‌ ఆశాసంఘం నుంచి లీలా బంతి అహారి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
భవిష్యత్‌ కార్యాచరణ
1. మే 20న జరిగే అఖిల భారత సార్వత్రిక సమ్మెలో అధిక సంఖ్యలో ఆశా వర్కర్లు, ఫెసిలిటేటర్లు పాల్గొంటారు. మే 3న సమ్మె నోటీసు జారీ చేస్తారు.
2. జిల్లా ప్రధాన కార్యాలయంలో సామూహిక ధర్నాలు, జులైలో ఎంపీలకు మెమోరాండం అందజేస్తారు.
3. ఆగస్టులో దేశవ్యాప్తంగా ఆశా కార్మికుల సమ్మె నిర్వహిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img