Sunday, July 27, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంచైనా వైద్య బీమా భేష్‌

చైనా వైద్య బీమా భేష్‌

- Advertisement -

95 శాతం జనాభాను కవర్‌ చేసిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌
నేషనల్‌ హెల్త్‌కేర్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ వెల్లడి
బీజింగ్‌
: చైనా ప్రాథమిక వైద్య బీమా మంచి పని తీరును కనబరుస్తున్నది. ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అక్కడి యంత్రాంగం పని చేస్తున్నది. 2021-2025 కాలంలో ఈ బీమా దాదాపు 95 శాతం కవరేజ్‌ రేటును సాధించింది. 2024లో 132 కోట్ల మందికి పైగా ప్రజలు ఈ బీమా కింద తమ పేర్లను నమోదు చేసుకున్నారు. నేషనల్‌ హెల్త్‌కేర్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ ఈ సమాచారాన్ని వెల్లడించింది. ఈ విభాగానికి చెందిన చీఫ్‌ జాంగ్‌ కె ఈ డేటాను వెల్లడించారు. దీని ప్రకారం.. చైనాలో 2021 నుంచి 2024 మధ్య దాదాపు రెండు వేల కోట్ల మెడికల్‌ అపాయింట్‌మెంట్లకు రీయింబర్స్‌మెంట్‌లు అందాయి. 2024లో నమోదైన సంఖ్య.. 2020 ఏడాదితో పోలిస్తే 1.6 రెట్లు అధికంగా ఉన్నది. దేశవ్యాప్తంగా వైద్య సహాయ పథకాలు ప్రతీ ఏడాదీ సుమారు 8 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుస్తున్నాయి. ఇదే విభాగానికి చెందిన డిప్యూటీ హెడ్‌ లి టావో వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2021-2025 మధ్య దేశవ్యాప్తంగా సంబంధిత అధికారులు వెనుకబడిన వర్గాల ప్రజలకు సహాయం చేయటానికి దాదాపు 72.3 బిలియన్‌ యువాన్లు( రూ.83 వేల కోట్లకు పైగా) ఖర్చు చేశారు. 35 కోట్ల ఇన్సూరెన్స్‌ కవరేజ్‌ కేసులకు తోడ్పాటు అందింది. ఈ చర్యలతో గ్రామీణ ప్రాంతాల్లోని తక్కువ ఆదాయం కలిగిన జనాభాలో 99 శాతం కంటే ఎక్కువ మంది, పేదలు చైనాలో వైద్య బీమా పరిధిలోకి వస్తున్నారు. దీంతో చైనాలోని వైద్య బీమాపై వైద్య నిపుణులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -