Sunday, July 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరూ.2 లక్షలు లంచం తీసుకుంటూ..

రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ..

- Advertisement -

ఏసీబీకి చిక్కిన రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ఉప కమిషనర్‌
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌

చాలా కాలంగా అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ఉప కమిషనర్‌ రవికుమార్‌ రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల కు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికారు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఒక హౌటల్‌ ఫుట్‌ కోడ్‌ నిర్వహణలో చాలా లోపాలు ఉన్నాయని హౌటల్‌ యజమానిని రూ.ఐదు లక్షలు ఇవ్వాలని డిప్యూటీ కమిషనర్‌ రవికుమార్‌ బెదిరిం చారు. దాంతో యజమాని రూ.ఐదు లక్షలు ఇవ్వలేనని, రూ.రెండు లక్షలు ఇస్తానని బేరం కుదుర్చుకున్నాడు. అనంతరం ఆ హౌటల్‌ యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం మధ్యాహ్నం రెండు లక్షల రూపాయలు కమిషనర్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తర్వాత కారును తనిఖీ చేయగా అందులో ఉన్న బ్యాగులో కూడా డబ్బులు దొరికాయి. కమిషనర్‌ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. చాలా కాలంగా అతనిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగితే వెంటనే 1064 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంటాయని డీఎస్పీ తెలిపారు. ఈ మేరకు రవికుమార్‌ను అరెస్ట్‌ చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -