- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: వెస్టిండీస్‌తో మూడో టీ20లో ఆస్ట్రేలియా బ్యాటర్ టిమ్ డేవిడ్ వీరవిహారం చేశాడు. కరేబియన్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 37 బంతుల్లోనే శతకం బాదాడు. అతని తుపాన్ ఇన్నింగ్స్ లో 11 సిక్సర్లు, 6 ఫోర్లు నమోదు కావడం విశేషం. అలాగే డేవిడ్ కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో ఆసీస్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ, ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఓవరాల్‌గా టీ20ల్లో అత్యంత వేగవంతమైన శతకం ఈస్టోనియా ప్లేయర్ సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. అతడు కేవలం 27 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
- Advertisement -